దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఓ చోట ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అతివేగం… అజాగ్రత్తం రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతోంది. ప్రమాదాల్లో కుటుంబాలకు కుటుంబాలే దుర్మరణం పాలవుతున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు.
లక్నో- అయోధ్య హైవేపై ఈరోజు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా రామ్ సనేహి ఘాట్లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మృతుల్లో దంపతులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు వెలుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఏఎస్పీ పూర్ణేందు సింగ్ తెలిపారు. యూపీ నారాయణపూర్ సమీపంలోకి రాగానే పక్కనే ఉన్న కంటైనర్ ట్రక్కును కారు అతివేగంతో ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు.