ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 125 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారులు సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 43 కరోనా కేసులు నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో 51 కరోనా కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా ప్రజలు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని.. మాస్క్ భౌతిక దూరం పాటించాలని వైద్య అధికారులు తెలిపారు.