నదుల అనుసంధానంపై రాష్ట్రాలతో ఈనెల 18న కేంద్ర ప్రభుత్వం చర్చలు

-

నదుల అనుసంధానంపై ఈ బడ్జెట్ లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి- కావేరి నదుల అనుసంధానంపై ప్రస్తావించింది. ఇదిలా ఉంటే నదుల అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాలతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 18న ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి  రాష్ట్రాల జలవనరులు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులను ఈకార్యక్రమానికి ఆహ్వానించింది. ఇదిలా ఉంటే ఈ భేటీపై రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నదుల అనుసంధానంపై కేంద్ర తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రాష్ట్రాలను సంప్రదించకుండా.. ఏ అధికారంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రశ్నించారు. కేంద్రానికి ఉన్న అధికారాలేమిటని ప్రశ్నించారు. ఈనెల 18న జరిగే ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news