ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. సన్ రైజర్స్ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఆటగాళ్ల వేలం సమయంలో ఆటగాళ్ల కొనుగోలు, ఎంపిక విషయంలో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు దిఆస్ట్రేలియన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కు ముందు ఇది సన్ రైజర్ హైదరాబాద్ జట్టుకు కోలుకోని దెబ్బే.
ఆటగాళ్ల ఎంపిక విషయంలో సన్ రైజర్స్ అసలు స్ట్రాటజీనే అవలంభించలేదని.. చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇటీవల జరిగిన వేళంలో అసలు సన్ రైజర్స్ పాల్గోందా.. అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో సన్ రైజర్స్ నిద్ర పోతున్నారా అంటూ.. నెటిజెన్లు కామెంట్స్ పెట్టారు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో.. స్టార్లను వదిలేసి.. అంతగా పేరులేని ఆటగాళ్లను కొనుగోలు చేశారు. దీనిపై సన్ రైజర్స్ ఫ్యాన్స్ తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్ లో 14 మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ కేవలం 3 మ్యాచుల్లోనే గెలిచింది. కీలకమైన ఆటగాడు డేవిడ్ వార్నర్ ను వదులుకున్నారు.