మీ ఆడపిల్లలని సుకన్య సమృద్ధి స్కీమ్ లో చేర్చారా..? అయితే మరి అబ్బాయలనీ ఇందులో చేర్చండి..!

-

పిల్లల కోసం కూడా స్కీమ్స్ వున్నాయి. వీటిలో చేరితే చదువుల కోసం కానీ పెళ్లిళ్ల కోసం కానీ ఆ డబ్బులుని వాడుకొచ్చు. పిల్లల భవిష్యత్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు రెండు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలున్నాయి. ఒకటి సుకన్య సమృద్ధి యోజన. రెండోది చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఆడపిలల్లలైతే సుకన్య సమృద్ధి యోజన బెస్ట్.

money
money

ఆడపిల్లలకు 10 ఏళ్లు వచ్చేంత వరకు తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ వారి కోసం అకౌంట్ ఓపెన్ చేయచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అత్యధికంగా ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఇది అందిస్తుంది. పైగా పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందొచ్చు. అదే మీకు అబ్బాయి అయితే చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వున్నాయి.

చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా పిల్లల పెళ్లిళ్లకు, చదువుల అవసరాల కోసం ఆర్థిక అవసరాలను తీరుస్తూ ఉంటాయి. అనుకోని ప్రమాదం వల్ల తల్లిదండ్రులు మరణిస్తే ప్రీమియం చెల్లించాల్సినవసరం లేకుండా పాలసీ కంటిన్యూ చేసుకోచ్చు.

ఆడపిల్లలు, అబ్బాయిలు ఇద్దరి కోసం ఈ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకొచ్చు. కొన్ని సార్లు మనీ బ్యాక్ విధానం కూడా ఉంటుంది. దీనిలో కూడా పన్ను ప్రయోజనాలున్నాయి. చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను మాత్రమే కాకుండా చౌకగా లభించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news