ఫుడ్ లవర్స్ కు ఇదో శుభవార్తే…ముఖ్యంగా బిర్యాని లవర్స్ కు ఈ విషయం చెప్తే ఎగిరి గంతేస్తారేమో.. జులాయి మూవీలో బన్నీ గంటలో లక్ష సంపాదిస్తా అని ఛాలెంజ్ చేస్తాడుకదా..ఇక్కడ గంట అక్కర్లా..అరగంటలో లక్ష సంపాదించేయొచ్చు..! కడుపునిండా బిర్యాని తిని లక్షరూపాయిలు సొంతం చేసుకోవచ్చు. వాళ్లు పెట్టిన బిర్యాని మొత్తం తింటే చాలట. ఆంధ్రాలోని విజయవాడకు చెందిన ఇద్దరు యువకులు రెస్టారెంట్ బిజినెస్ లో కొత్త ట్రెండ్ సృష్టించారు. బిర్యాని తిని బిల్ ఎవడైనా కడతాడు..కానీ తిరిగి మీకే లక్ష ఇస్తానంటే..నమ్మడం లేదా..అయితే చూడండి..
బెజవాడలోని నాయుడుగారి కుండ బిర్యానీ రెస్టారెంట్ లో ఈ ఆఫర్ ఉంది..నగరానికి చెందిన వర నాయుడు, సత్యనారాయణ అనే యువకులు నాయుడుగారి కుండ బిర్యానీ పేరుతో రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. అందరిలాగా వ్యాపారం చేస్తే కిక్ ఏముంటదని అనుకున్నట్లున్నారు…కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ ఫుడ్ ఛాలెంజ్ ను ఫినిష్ చేస్తే అక్షరాల లక్ష ఇస్తామని ప్రకటించేశారు.. దీంతో ఈ ఫుడ్ ఛాలెంజ్ కు యమ క్రేజ్ వచ్చింది.
మొత్తం 30 రకాల ఫుడ్ ఐటమ్స్ తో బాహుబలి థాలీని సిద్ధం చేసి పందేనికి సిద్ధమైనవారికి ఇస్తారు. ఈ మెగా బిర్యానీని కేవలం 30 నిముషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా ప్లేట్ ఖాళీ చేసిన రియల్ భీములకు అక్షరాల లక్షరూపాయలు ఇస్తారు.. మంచి బిర్యాని..బాగా ఆకలేసినప్పుడు వెళ్లామంటే..అయిపోతుంది..అనుకుని కిక్ తో చాలా మంది ట్రై చేశారు.
లిస్ట్ పెద్దదే..!
కానీ, తిండి తిని లక్ష గెలిచేద్దాం అనుకుంటే అంత సులభం కాదు. అందులో ఐటమ్స్ లిస్ట్ చూస్తే చాంతాడంత ఉంది. అందులో నాయుడుగారి కుండ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, షెజ్వాన్ నూడుల్స్, వెజ్ ధమ్ బిర్యానీ, ప్రాన్ మసాలా, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ జాయింట్, చికెన్ వింగ్, పనీర్ మెజిస్టిక్, మష్రూమ్ మంచూరియన్, చిల్లీ చికెన్, నాటుకోడి, ఫిష్, కౌజు పిట్ట, కర్డ్ రైస్, రెండు లస్సీలు, రెండు సోడాలు, వాటర్ బాటిల్, గోంగూర కర్రీ, ఆనియన్స్, ఆమ్లెట్, ఫ్రైడ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్.. ఇవన్నీ అరగంటలో గుటుక్కుమనిపిస్తే లక్ష రూపాయలు మీ సొంతం
గెలిచిన వారు ఉన్నారు..
ఇప్పటివరకు దాదాపు 500 మంది వరకు ఫుడ్ ఛాలెంజ్ లో పాల్గొనగా.. ఒక్క యువకుడు మాత్రం గెలిచి లక్ష రూపాయలు సొంతం చేసుకున్నాడు. ఈ పందెంలో గెలిచిన వాళ్లుకు లక్ష .. ఓడిన వాళ్లు మాత్రం మొత్తం 30 ఐటమ్స్ కు సంబంధించిన బిల్లు మాత్రం చెల్లించాల్సిందే. ఈ బాహుబలి థాలీకి రూ.1499 చెల్లించాలని నిర్వాహకులు చెబుతున్నారు. అంటే వస్తే లక్ష పోతే 1500 అన్నట్లు..కడపునిండా అయితే తినొచ్చు కదా..!
ఈ బాహుబలి బిర్యానీ ఛాలెంజ్ పెట్టిన తర్వాత హోటల్ కు వచ్చే కస్టమర్లు పెరిగినట్లు రెస్టారెంట్ నిర్వాహకుడు వర నాయుడు అంటున్నారు. కస్టమర్లకు సంతృప్తితో పాటు అదనపు ఆనందాన్ని ఇచ్చేందుకు ఈ ఛాలెంజ్ పెట్టినట్లు ఆయన చెప్పారు. విజయవాడతో పాటు రాజమండ్రి, తెనాలి, కుప్పంలోనూ నాయుడుగారి కుండ బిర్యానీ బ్రాంచెస్ ఉన్నాయట.
ఫుడ్ బిజినెస్ లో ట్రెండ్ క్రియేట్ చేయడమే కాదు.. సమాజసేవలోనూ ఈ కుర్రాళ్లు ముందున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వైరస్ సొకి ఇంట్లోనే ఉన్నవారికి స్వయంగా వంట చేసి ఉచితంగా భోజనం పంపిణీ చేశారట. మన విజయవాడ వాసులంతా ఓ సారి ఈ నాయుడుగారి కుండ బిర్యానిపై ఓ లుక్కేయండి మరీ..! అరగంటలో లక్ష సంపాదించేయండి బాస్.!
-Triveni Buskarowthu