అప్పటి నుంచి ఆగ్రామంలో అవే ఆచారాలను పాటిస్తున్నారు. గర్భిణీలు వేరే ఊరికి వెళ్లి పిల్లలను కంటున్నారు. ఎవరైనా గ్రామస్తులు చనిపోతే వేరే ఊళ్లో ఖననం చేస్తారు.
ఇప్పుడు కాదు కానీ.. 20 ఏళ్ల కింద ఆసుపత్రులు ఎక్కడివి. గర్భిణీలకు ఇంట్లోనే మంత్రసాని ప్రసవం చేయాల్సిందే. అప్పుడు ఇన్ని ఆసుపత్రులు, ఇన్ని ఫెసిలిటీలు ఎక్కడివి. ఇంట్లోనే హ్యాపీగా మహిళలు తమ బిడ్డలకు జన్మనిచ్చేవారు. కానీ.. ఇప్పుడు ఆసుపత్రులు వచ్చాయి.. సౌకర్యాలు పెరిగాయి. గర్భిణీ అయిన క్షణం నుంచి డెలివరీ అయ్యే వరకు ప్రతి క్షణం వైద్యుల పర్యవేక్షణలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సొల్లంతా ఎందుకు అంటే.. ఓ ఊళ్లో అసలు పిల్లలకు జన్మనివ్వకూడదు. ఆ ఊళ్లో జన్మనిస్తే వాళ్లు మహాపాపం చేసినట్టే. అంతేనా.. చనిపోయిన వాళ్లను కూడా ఆ ఊళ్లో ఖననం చేయకూడదు. పూడ్చిపెట్టకూడదు. జంతువులను పెంచుకోకూడదు. ఇలాంటి ఆంక్షలున్న గ్రామాన్ని మీరు ఎప్పుడైనా చూశారా?
అది దక్షిణాఫ్రికాలోని ఘనాలో ఉన్న మాఫి దోవ్ అనే గ్రామం. ఆ ఊళ్లో మూఢాచారాలు ఎక్కువ. సాంకేతిక యుగంలోనూ ఆ మూఢాచారాలే ఇంకా రాజ్యమేలుతున్నాయి. వాటికి ఆ గ్రామస్తులు తల వంచక తప్పడం లేదు. ఆ ఊళ్లో పిల్లలను కనడం అపరాధమట. దైవ ద్రోహమట.
ఎందుకలా?
ఆ ఊళ్లోకి అప్పట్లో వచ్చిన పూర్వీకులకు స్వర్గం నుంచి ఓ ఆకాశవాణి మాటలు వినిపించాయట. ఇది పవిత్ర భూమి. పవిత్ర క్షేత్రం. మీరు ఇక్కడ ఉండాలంటే కొన్ని నియమాలను పాటించాలి. ఈ ఊళ్లో ఎవరూ పిల్లలను కనకూడదు. ఎవరూ జంతువులను పెంచుకోకూడదు. చనిపోయాక ఎవరినీ ఈ ఊళ్లో ఖననం చేయకూడదు.. అని చెప్పి ఆకాశ వాణి మాయమయిందట.
అప్పటి నుంచి ఆగ్రామంలో అవే ఆచారాలను పాటిస్తున్నారు. గర్భిణీలు వేరే ఊరికి వెళ్లి పిల్లలను కంటున్నారు. ఎవరైనా గ్రామస్తులు చనిపోతే వేరే ఊళ్లో ఖననం చేస్తారు. కోసుకొని తినడం కోసం మాత్రమే జంతువులను ఆ ఊళ్లోకి తీసుకొస్తారు.. భలే గమ్మత్తుగా ఉంది కదా ఊరు.