వెంకటేష్ కూతురు పెళ్లిలో సల్మాన్ ఖాన్ హంగామా..!

విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లి హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో నిశ్చయించారు. వినాయక్, అశ్రిత ఇద్దరు ప్రేమించుకోవడం వారి ప్రేమకు పెద్దల అంగీకారం లభించడం జరిగింది. ఈమధ్యనే ఎంగేజ్మెంట్ జరుపుకున్న వినాయక్, అశ్రితల పెళ్లి జైపూర్ లో జరుగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకోవడం జరిగింది.

శుక్రవారం రాత్రి సంగీత్ కార్యక్రమంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అటెండ్ అయ్యారట. వెంకటేష్, సల్మాన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. అందువల్లే వెంకీ కూతురు పెళ్లికి సల్మాన్ అటెండ్ అయ్యాడు. రానా, నాగ చైతన్య, సమంత కూడా ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో పాటిస్పేట్ చేసినట్టు తెలుస్తుంది. కొద్దిమంది అతిథులు మాత్రమే వీరి పెళ్లికి పిలవడం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు వారి కుటుంబానికి చాలా దగ్గరైన వారు మాత్రమే వచ్చారు.

పెళ్లి తర్వాత హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ రిసెప్షన్ కు తెలుగు సిని పరిశ్రమ మొత్తం కదిలి వచ్చేలా ప్లాన్ చేశారట. మొత్తానికి వెంకీ కూతురు పెళ్లి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సీక్రెట్ గా ప్లాన్ చేశారు. పెళ్లి ఎప్పుడు ముహుర్తం ఎన్నిటికి అన్న విషయాలను కూడా సీక్రెట్ గా ఉంచడం విశేషం.