తన చారిత్రక 100 వ టెస్ట్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ ను సొంత చేసుకున్నాడు. మెహాలీలో శ్రీలంకతో జరుగుతున్నమొదటి టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో తన 8000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ కు చేరుకోవడంతో ఈ ఫీట్ ను సాధించాడు. భారత్ తరుపున ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
అంతకు ముందు ఈ ఘనత సాధించిన వారిలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ లు టెస్ట్ క్రికెట్ లో 8 వేల పరుగులు చేసిన వారిలో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో కోహ్లీ కూడా చేరారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ 100వది కావడం విశేషం. వందో టెస్ట్ లో కోహ్లీ సెంచరీ చేయాలని క్రికెట్ అభిమానులు, కోహ్లీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
దేశం తరఫున 100 టెస్టులు ఆడిన క్రికెటర్లలో సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మలు ఉన్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా చేరారు.
టెస్టుల్లో 8000 పరుగులు చేసిన వారి జాబితా:
1. సచిన్ టెండూల్కర్ – 15,921 పరుగులు (200 టెస్టులు)
2. రాహుల్ ద్రవిడ్ – 13,265 పరుగులు (163 టెస్టులు)
3. సునీల్ గవాస్కర్ – 10,122 పరుగులు (125 టెస్టులు)
4. VVS లక్ష్మణ్ – 8,781 పరుగులు (134 టెస్టులు)
5. వీరేంద్ర సెహ్వాగ్ – 8,503 పరుగులు (103 టెస్టులు)
6. విరాట్ కోహ్లీ – 8,000 పరుగులు (100 టెస్టులు)