మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మర్డర్ ప్లాన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. రూ.15 కోట్లు సుపారీ ఇచ్చి హత్య చేసేందుకు స్కెచ్ వేశారు. అయితే పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. అయితే.. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితులకు నాలుగు రోజులు కస్టడి విధించిస్తూ మేడ్చల్ కోర్టు తీర్పు ఇచ్చింది.
రేపటి నుండి 13 వరకు పోలీస్ కస్టడికి ఏడుగురు నిందితులకు అనుమతించింది మేడ్చల్ కోర్టు. నిందితులను కస్టడికి ముందు, కస్టడీ ముగిసిన తరువాత వైద్య పరీక్షలు చేయించాలని.. కస్టడీ విచారణ మొత్తం వీడియో గ్రఫీ చేయాలి , వీడియో రికార్డింగ్ మొత్తం కోర్ట్ కి సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
నిందితుల విచారణ న్యాయవాదులు ముందు విచారణ జరపాలని.. ఈ కేసులో పోలీసులు సీజ్ చేసిన ఆయుధాలు, ప్రాపర్టీ ని కోర్టు కి సమర్పించాలని స్పస్టం చేసింది మేడ్చల్ కోర్టు. కష్టడీ లోకి తీసుకున్న తరువాత నిందితులు పై థార్డ్ డిగ్రీ ప్రయోగించరాదని ఆదేశించింది.