బ్యాడ్ న్యూస్ : స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. వెండి కూడా

-

గ‌త రెండు రోజుల పాటు కొనుగోలు దారుల‌కు అనుకూలంగా ఉన్న బంగారం ధ‌ర‌లు.. మ‌ళ్లీ షాక్ ఇస్తున్నాయి. శుక్ర‌వారం బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. శ‌నివారం ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయి. కానీ నేడు బంగారం ధ‌ర‌లు మ‌రోసారి పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తి గ్రాము బంగారంపై రూ. 220 వ‌ర‌కు పెరిగాయి. దీంతో హైదారాబాద్, విజ‌య‌వాడ వంటి న‌గ‌రాల్లో 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 48,400 గా ఉంది.

అలాగే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 52,800 గా న‌మోదు అయింది. అలాగే వెండి ధ‌ర‌లు అయితే వ‌రుస‌గా రెండో రోజు పెరిగాయి. శ‌నివారం కిలో గ్రాము వెండిపై రూ. 500 పెర‌గ‌గా, నేడు రూ. 100 పెరిగింది. దీంతో హైద‌రాబాద్, విజ‌య‌వాడ న‌గ‌రాల్లో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 74,700 కు చేరుకుంది. కాగ బంగారం, వెండి ధ‌ర‌ల‌పై ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధ ప్ర‌భావం స్ప‌ష్టంగా తెలుస్తుంది. అలాగే అంత‌ర్జాతీయ మార్కెట్ ల‌లో బంగారం, వెండి ధ‌ర‌ల్లో మార్పుల‌కు అనుగూణంగా ఇక్క‌డ కూడా మార్పులు జరిగే అవ‌కాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news