తూప్రాన్ మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాన్ పూర్ స్టేజి వద్ద వేగంగా వచ్చిన ఒక బైక్ అదుపుతప్పి బండరాయిని ఢీకొట్టడంతో యావపూర్ గ్రామానికి చెందిన వడ్ల రవి(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటుగా వెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.