నేడు, రేపు తెలంగాణలో వడగండ్ల వర్షాలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. ఈ రోజు నుంచి రేపు, ఎల్లుండి తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం వెల్లడించింది. నేడు, ఎల్లుండి రాష్ట్రంలో తేలిక పాటి నంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తామని వెల్లడించింది.

రేపు మాత్రం రాష్ట్రంలో పొడివాతావరణ నెలకొని ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతా నుంచి తెలంగాణ మీదుగా దక్షిన తమిళనాడు వరకు సముద్రమట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ఈ రోజు ఇది బలహీన పడినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడా మీదుగా.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల వద్ద కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర జిల్లాలలో.. వడగండ్ల వర్షాలు పడే ఛాన్స్‌ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news