BRS పాలనే కావాలని 70 శాతం ఓట్లు మనకే వచ్చాయని మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో విజయం మనదే. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలి. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడదాం.. మీరంతా తరలిరండి. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడేనని తెలిపారు.
“ఇన్ని రోజులుగా నేను మోనంగా, గంబిరంగా చూస్తున్న. నేను కొడితే మాములుగా ఉండదు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్ళకి చూపించి మెడలు వంచుదాం. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. నేను చెప్పిన ప్రజలు వినలేదు..అత్యాశకు పోయి కాంగ్రెస్ కి ఓటేశారు. రైతు బంధుకి రాం రాం, దళితబంధుకి జై భీం చెబుతారని ఆనాడే చెప్పాను. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కి ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే” అని తెలిపారు కేసీఆర్.
నేను ఇన్ని రోజుల నుంచి గంభీరంగా, మౌనంగా చూస్తున్న
నేను కొడితే మామూలుగా ఉండదు
నిన్న పోల్ పెడితే 70% మనకే వచ్చింది
ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెట్టుకుందాం
– మాజీ సీఎం కేసీఆర్ pic.twitter.com/KGE0fiVXlL
— BIG TV Breaking News (@bigtvtelugu) January 31, 2025