రేపు బోధన్ బంద్ కు పిలుపు ఇచ్చిన బీజేపీ.. బంద్ కు అనుమతి లేదంటున్న పోలీసులు

-

నిజామాబాద్ జిల్లా బోధన్ లో చత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు ఉద్రిక్తతలకు దారి తీసింది. గత రాత్రి శివసేన, బీజేపీ కార్యకర్తలు బోధన్ లో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఓ వర్గం వారు విగ్రహ ఏర్పాటును వ్యతిరేఖిస్తూ నిరసనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు రాళ్లదాడి చేసుకున్నారు. దీంతో బోధన్ లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించే వరకు వెళ్లాయి పరిస్థితులు. బోధన్ కు బయటి వ్యక్తులు ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరించారు. మతవిద్వేషాలను రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు పోలీసులు. 

తాజాగా బోధన్ ఘటనపై బీజేపీ రేపు బోధన్ బంద్ కు పిలుపునిచ్చింది. అయితే బోధన్ లో రేపటి బంద్ కు ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు పోలీసులు. అదనపు డీజీ నాగిరెడ్డి బోధన్ లోని పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తున్నారు. రేపటి బంద్ కు అనుమతి లేదని… ఎవరూ కూడా షాపులు బంద్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పోలీసుల తీరును బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండించింది. పోలీసులు ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించింది బీజేపీ.

Read more RELATED
Recommended to you

Latest news