తులసి మొక్క దగ్గర ఈ రెండిటినీ అస్సలు పొరపాటున కూడా వుంచద్దు..!

-

ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో తులసి మొక్కని పూజిస్తూ వుంటారు. ఎంతో పవిత్రంగా భావించి రోజు దీపం పెట్టి పూలతో పూజ చేస్తారు. అయితే తులసి మొక్క దగ్గర అనుసరించే పద్ధతులు పట్ల శ్రద్ధ తీసుకోవాలి లేదంటే అనవసరంగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజానికి తులసి మొక్కను పూజించండి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల ఎంతో మంచి కలుగుతుంది.

అయితే తులసి మొక్క దగ్గర కొన్ని వస్తువుల్ని ఉంచారు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేము అని పండితులు చెప్తున్నారు. మరి తులసి మొక్క దగ్గర ఎలాంటి వస్తువులను ఉంచకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. నారాయణుడి రూపంగా తులసి మొక్కని భావిస్తారు.

అందుకే తూర్పు వైపున తులసి మొక్కను ఏర్పాటు చేసి పూజ చేయడం జరుగుతుంది. తులసి కోట నారాయణ రూపం. తులసి మొక్క లక్ష్మీదేవి రూపం. తులసి మొక్కని ఎప్పుడూ అందంగా ఉంచాలి. అలానే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త చెదారం ఏమీ లేకుండా చూసుకోవాలి.

ఎప్పుడూ కూడా తులసి మొక్క చుట్టు పక్కల ప్రాంతాలలో బక్కెట్ నిండా నీటిని నింపి ఉంచకూడదు. అలాగే తులసి మొక్క ఉన్న ప్రాంతంలో చెప్పులు వంటి వాటిని విడిచిపెట్టి వెళ్లిపోకూడదు. బకెట్ లో నీళ్ళు ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి సమస్యలు తీసుకువస్తుంది. కనుక ఎప్పుడూ కూడా తులసి కోట చుట్టుపక్కల అందంగా ఉంచుకోవాలి. అలానే శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news