ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలం లో వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఈజీగా మనం సందేశాలను పంపుకోవచ్చు. అలాగే ఇమేజెస్, వీడియోస్ మొదలైన వాటిని కూడా మనం వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు. అయితే వాట్సాప్ లో ఒక కొత్త ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మామూలుగా ఎవరైనా ఏదైనా మెసేజ్ లు పంపితే… ఆ మెసేజ్ లో ఏదైనా తప్పు కానీ లేదు అంటే వాళ్ళు దానిని పంపకూడదు అనుకున్నా డిలీట్ ఫరెవర్ అనే ఫీచర్ ని ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ మెసేజ్ డిలీట్ అయిపోతుంది. ఒక గంట 8 నిమిషాలు 16 సెకన్ల వరకూ తమ చాట్ పేజీ తో పాటు అవతలి వ్యక్తి నుండి మెసేజ్ ని డిలీట్ చేయొచ్చు.
అయితే కొద్ది వారాల క్రితం ఈ టైం లిమిట్ లో మార్పు చేసి దీనిని రెండు రోజుల 12 గంటలకి పెంచింది వాట్సాప్. అయితే త్వరలో ఈ టైం లిమిట్ ని పూర్తిగా తొలగించనునట్లు తెలుస్తోంది. ఎలాంటి టైం లిమిట్ ఏమి లేకుండా ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు.
రీడ్ లేటర్:
వాట్సాప్ ఆర్చివ్ లో కూడా మార్పులు చేశారు. ఈ పేరు రీడ్ లేటర్గా మారుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అయితే ఆర్చివ్ చేసిన చాట్ పేజ్ అన్నిటి కంటే కింద కి వెళ్ళేది ఏదైనా కొత్త మెసేజ్ వస్తే పైకి కనిపించేది. ఈ ఫీచర్ లో కూడా వాట్సాప్ మార్పు చేసింది. ఆర్చివ్ చేసిన చాట్ పేజీలలో కొత్త మెసేజ్లు వచ్చినా యూజర్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవి ప్రత్యేక ఫోల్డర్ లోకి వెళ్లి పోతాయి. దీంతో నచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేసి అందులోని మెసేజ్లను చూసుకోవచ్చు.