హైదరాబాద్ లో బీభత్సంగా ట్రాఫిక్ సమస్య ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే.. ట్రాఫిక్ సమస్యలతో సతమతమౌవుతున్న హైదరాబాద్ నగన వాసులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. పాదచారుల కష్టాలను గుర్తించిన అధికారులు పలు ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను నిర్మించారు. చందానగర్ లో పాదాచారులు ప్రమాదాలకు గురి కాకుండా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించారు.
దీప్తి శ్రీ నగర్ ఎంట్రన్స్ ఎదురుగా జాతీయ రహదారి 65 పై రూ.5.5 కోట్లు, పీజేఆర్ ఎన్ క్లేవ్ వద్ద రూ.5.2 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో పాదచారులకు జాతీయ రహదారి 65 దాటడం సులభతరం కానుంది.
చందానగర్ లో ఉన్న ఈ రెండు బ్రిడ్జీలను గురువారం ప్రభుత్వ విప్ శేరి లింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డి.మేయర్ శ్రీలత శోభన్ లు ప్రారంభించనన్నారు. వీటి నిర్మాణం కోసం ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం అందుతోంది.