ఆర్ఆర్ఆర్ సినిమాతో..టాలీవుడ్ బడా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు అయ్యారు. సినిమాలో కంటే.. బయటే వీరి మధ్య స్నేహం పీక్ స్టేజ్ కు వెళ్లింది. అన్నదమ్ముల్లాగా ఇద్దరు కలిసి.. ఎంజాయ్ చేస్తున్నారు. రెండు రోజుల కిందట ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాగా.. మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది.
అందులోనూ.. నిన్న ఎన్టీఆర్ భార్య ప్రణతీ, ఇవాళ రామ్ చరణ్ 37 వ పుట్టిన రోజు కావడంతో.. వీళ్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇంకేముంది నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో వీరిద్దరి బర్త్ డే వేడుకులను ఘనంగా జరుపుకున్నారు. అయితే.. ఈ సెలబ్రేషన్లో రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తీకేయ ఫ్యామిలీ కూడా పాల్గొంది. అయితే.. ఈ వేడకులకు సంబంధించిన ఫోటోను రామ్ చరణ్ భార్య ఉపాసన తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పోస్ట్ చేయడమే కాకుండా.. రామ్ చరణ్ కు, అలాగే ఎన్టీఆర్ భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
టాలీవుడ్ చిత్ర సీమలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ హీరోలు తమ సినిమాలతో నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటారు. జయాపజయాలు ఎవరినీ వరిస్తాయి అనే విషయాలను పక్కన పెడితే.. ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోల మధ్య జరిగే యుద్ధం అనేది మాత్రం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతుంటుంది. అలాంటిది ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మాత్రం అందరికీ భిన్నంగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో.. ఎంతో క్లోజ్ అయ్యారు. స్నేహమంటే ఇదేరా అన్న తరహాలో వీరిద్దరూ ముందుకు వెళుతున్నారు. ఇక వీరి ఫ్రెండ్షీప్ చూసి అందరూ కుల్లు కుంటున్నారు. కాగా.. ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను కొల్లగొడుతోంది.
Happy happy birthday to my Mr C. &
My sweetest Pranathi 🤗🤗🤗🤗 #famjam @AlwaysRamCharan pic.twitter.com/DDJxXWs7Jo— Upasana Konidela (@upasanakonidela) March 27, 2022