రాజమౌళి ప్రతి సినిమాలో ఆ నటుడికే ఛాన్స్..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు బాహుబలి సినిమా తో తెలుగు కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమాతో మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించిన బాహుబలి రికార్డులను కూడా చెరిపి వేశాడు. ముఖ్యంగా రాజమౌళి రికార్డులను రాజమౌళి తప్ప మరే దర్శకుడు బ్రేక్ చేయలేదు అని చెప్పవచ్చు.

 

 

 

రాజమౌళి ఒక నటుడికి అడగక పోయినా తాను తీసే ప్రతి సినిమాలో కూడా అవకాశం కల్పిస్తూ ఉండడం గమనార్హం. ఆ నటుడు ఎవరు కారణం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉన్నప్పటికీ ఛత్రపతి సినిమా ద్వారా శేఖర్ మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. ఆ సినిమాలో తనకు ఇచ్చిన పాత్ర చిన్నదే అయినా దాని పైన తనదైన ముద్ర వేయగలిగారు.. సమర్ధుడు చత్రపతి శేఖర్.

రాజమౌళి సినిమాలో ఎక్కువగా ఈయనకు అవకాశాలు కల్పిస్తూ ఉంటారు.RRR లో ఛత్రపతి శేఖర్ కి మంచి రోల్ పడిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో కీలకమైన మల్లి పాత్రకి తండ్రిగా ఆయన కనిపిస్తాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను తెలియజేశారు. రాజమౌళి గారిని నేను ఎప్పుడూ కూడా అవకాశాలు అడగలేదు. నాకు సపోర్ట్ చేయాలని ఉద్దేశంతోనే ఆయన నాకు అవకాశాలు ఇస్తూ ఉంటారని తెలిపారు.

రాజమౌళి సీరియల్ చేస్తున్న అప్పటి నుంచి తనను ప్రోత్సహిస్తూనే ఉన్నారని..ఎప్పుడూ కూడా నేను ఆయనను కలిసే ప్రయత్నం చేయలేదు. కాల్ కూడా చేయను.. మెసేజ్ కూడా పెట్టను. ఆయనే నన్ను గుర్తు పెట్టుకొని మరి అవకాశాలు ఇస్తూ ఉంటారు అని తెలియజేశారు. RRR చిత్రంలో ఎన్టీఆర్ , చరణ్ ఇద్దరు చాలా గొప్పగా నటించారు. సీతను ఎన్టీఆర్ కలుసుకొని సీతారామరాజును తీసుకు వస్తానని మాట ఇచ్చినప్పుడు నిజంగా నాకు కన్నీళ్ళు వచ్చాయి.. నేను చెట్టెక్కే సీన్ యూరప్ లో తీయడం జరిగింది. నేను ఎక్కడ కింద పడిపోతానని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఆ సీన్ చేయడం జరిగింది.

చరణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది గాని చిరంజీవి సినిమాలో నటించే అవకాశం ఇంతవరకు రాలేదు. అయితే ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో లేదో తెలియదు అని తెలిపారు. చరణ్ కూడా అందరితో బాగా కలిసి మాట్లాడతారని.. చిరంజీవి ని కలవాలనే కోరిక ఉందని ఎప్పుడూ చెప్పలేదని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news