యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ వెల్లు విరుస్తోంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో మహా పూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలు అయ్యాయి. బాలాలయంలోని శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రతి ష్టామూర్తులతో నిర్వహించిన శోభాయాత్రలో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
శోభా యాత్రలో భాగంగా బంగారు కవమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లు, ప్రదర్శించడంతో పాటు కళా ప్రదర్శనలు చేపట్టారు. ఇక ప్రధానాలయ పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు.
అలాగే… ఇవాళ మధ్యాహ్నం 12.20 గంటలకు గర్భాయంలోని మూలవరుల దర్శనం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజ చేయనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల సమయం తర్వాత శ్రీ నరసింహా స్వామి వారి సర్వ దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. అటు యాదాద్రి సర్వ దర్శనానికి ఆలయ అధికారులు, సిబ్బంది.. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. చర్యలు తీసుకుంటున్నారు.