ఆ దేశంలో ఊబకాయిలను అద్దెకు ఇస్తారట..! గంటకు వేయిపైనే వసూల్..!

-

వ్యక్తుల్ని అద్దెక్విడం ఆ దేశానికి కొత్తేమి కాదు. ఓదార్చడానికి, కాసేపు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ గా నటించడానికి ఇలా మనుషులు అద్దెకు దొరుకుతారు. ఈపాటికే మీకు అది ఏ దేశమో తెలిసిపోయింది కదా.! జపాన్ అండి. అయితే ఇలాంటి సర్వీస్ లో అందంగా, ఆకర్షణీయంగా ఉండేవారికే డిమాండ్ ఉంటుంది. లావుగా ఉన్నవాళ్లను ఎవరూ పెద్దగా తీసుకోరు. అయితే లావుగా ఉన్న వారిని కూడా అద్దెకు ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకువచ్చింది. మీకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది కదా..లావుగా ఉన్న వాళ్లను అద్దెకు తీసుకుని అసలు ఏం చేస్తారు అని. మీరే చదవండి ఈ చేస్తారో..!

జపాన్‌కు చెందిన బ్లిస్‌ అనే ఓ వ్యక్తి లావుగా ఉండే వారి కోసం ‘క్యూ జిల్లా’ పేరుతో ఫ్యాషన్‌ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఆ బ్రాండ్‌ ప్రకటనల కోసం లావుగా ఉండే మోడల్స్‌ను వెతికితే ఎవరూ దొరకటం లేదట.. దీంతో తనకు లావుగా ఉండే మోడల్స్‌ కావాలని ఓ ప్రకటన ఇచ్చాడు. దీంతో తన కస్టమర్లలోనే చాలా మంది మోడలింగ్ చేస్తామని ముందుకొచ్చారు. 2017లో ఊబకాయులకు టాలెంట్‌ హంట్‌ పేరుతో కార్యక్రమం నిర్వహించాడు బ్లిస్. టాలెంట్‌ ఉన్నవాళ్లకు మోడల్స్‌గా కూడా అవకాశమిచ్చాడు. అయితే ఈ క్రమంలోనే బ్లిస్ కు ఓ క్రేజీ ఐడియా వచ్చింది. ఊబకాయుల్ని అద్దెకు ఇస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాడు. అలా ప్రారంభమైందే ‘దెబుకారీ’ సంస్థ.

మాములుగా మనం కాస్త లావు అవగానే..మనసులో బాధ అనిపిస్తుంది. బాగా సన్నగా ఉన్నవాళ్లను చూసినప్పడు ఈ బాధ మరీ ఎక్కవుగా ఉంటుంది. అలాగే మనకంటే లావు ఎక్కువగా ఉన్నవాళ్లను చూసినప్పుడు..హమ్మా మనం ఇంకా బెటరే..వీడు మరీ లావుగా ఉన్నాడు అనే ఏదో తెలియని సంతోషం వస్తుంది. ఇదే హ్యూమన్ సైకాలజీ. అదే పాలసీని ఇక్కడ ఉపయోగిస్తున్నారు.

ఎవరైనా కాస్త లావుగా ఉన్నవాళ్లు ఏ పార్టీకో, మీటింగ్‌కో వెళ్లినప్పుడు వారి వెంట ఈ ఊబకాయుల్ని తీసుకెళ్తే కాస్త సన్నగా కనిపిస్తారు. దీంతో లావుగా ఉన్నాననే భావనపోయి వారికి ధైర్యం వస్తుందట. అలాగే, ఎవరైనా లావుగా ఉండే స్నేహితులకు దుస్తులు కొనాలంటే ఈ అద్దె ఊబకాయుల్ని వెంట తీసుకెళ్లి షాపింగ్‌ చేయొచ్చు. శరీర బరువు తగ్గించే ఫిట్‌నెస్‌ సంస్థలు, డైట్‌ ప్లాన్‌ ఇచ్చే సంస్థలు వీరిని అద్దెకు తీసుకొని ప్రకటనలు రూపొందించుకోవచ్చు.

ఇలాంటి ఎన్నో అవసరాలను ఊహించే బ్లిస్‌ ఈ సంస్థను నెలకొల్పాడు. వీరి అద్దె గంటకు 2000 జపాన్‌ యెన్లు అంటే మన కరెన్సీలో రూ.1,315 ఉంటుందట. ఇప్పటికే కొందరు ఉద్యోగులుగా మారారు.. కొన్ని రోజుల కిందట దెబుకారీ సంస్థ మరో ప్రకటన విడుదల చేసింది. వంద కిలోలకు మించి బరువు ఉన్న అబ్బాయిలు/ అమ్మాయిలు తమ సంస్థలో ఉద్యోగులుగా చేరొచ్చని వెల్లడించింది. అద్దె పూర్తిగా ఉద్యోగికే వెళ్తుందట. కేవలం సంప్రదింపుల ఫీజు కింద కంపెనీలు/వ్యక్తుల నుంచి కొంత మొత్తం డబ్బును సంస్థ తీసుకుంటుందని తెలిపింది. ఇప్పటికే ఈ సంస్థ టోక్యో, ఒసాకా, అయిచీ వంటి నగరాల్లో తమ సేవల్ని అందించటం విశేషం.

కాసేపు బిజినెస్ యాంగిల్ పక్కనపెడితే..వాళ్లను ఎంత కించపరుస్తాన్నారు అనే భావన మీకూ కలిగిందా. పాపం వాళ్లను పక్కన పెట్టుకుని..వీళ్లు హ్యాపీగా ఫీల్ అవడం ఏంటండి. మనిషి ఆలోచనా విధానం మరీ ఇలా అయిపోయిందా? సంతోషం.. మన దగ్గర ఇలాంటివి లేవు!

Read more RELATED
Recommended to you

Latest news