భార్య, భర్తకు భరణం ఇవ్వాల్సిందే… బాంబే హైకోర్ట్ ఔరంగాబాద్ బెంచ్ సంచలన తీర్పు

-

సాధారణంగా భార్యభర్తలు విడాకులు తీసుకుని విడిపోతే… కోర్టులు భర్తను భార్యకు భరణం ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తాయి. ఇలాంటి కేసులను, తీర్పులను మనం చాలా సార్లు చూశాం. కానీ మహారాష్ట్రలో మాత్రం ఓ కేసులో ఇది రివర్స్ లో జరిగింది. భార్యనే భర్తకు భరణం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. బాంబే హైకోర్ట్ ఔరంగాబాద్ బెంచ్ సంచలన తీర్పు వెల్లడించింది. 1992లో పెళ్లి చేసుకున్న జంటకు వివాహం జరిగింది. అయితే కుటుంబ కలహాల కారణంగా 2015లో భార్య నాందేడ్ సివిల్ కోర్ట్ ను ఆశ్రయించింది. ఈక్రమంలో హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24,25 ప్రకారం భార్య నుంచి శాశ్వత భరణం ఇప్పించాలని కోరాడు. ఈ పిటిషన్ విచారణ చేసిన నాందేడ్ కోర్ట్ భార్య, భర్తకు భరణం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు ప్రస్తుతం ఏమీ లేదని… భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని, తను ఈ స్థాయికి చేరడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు. కోర్ట్ ఈ వాదనలో ఏకీభవించి భరణం ఇవ్వాలని తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే భార్య నాందేడ్ కోర్ట్ ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్ట్ ఔరంగాబాద్ బెంచ్ లో దాఖలు చేసింది. అయితే జౌరంగబాద్ హైకోర్ట్ కూడా నాందేడ్ సివిల్ కోర్ట్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. భార్య, భర్తకు భరణం చెల్లించాల్సిందే అని కోర్ట్ మళ్లీ తీర్పు చెప్పింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news