ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతి రైతులు మరో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. సిఆర్డిఏ అధికారులు ఒప్పంద ఉల్లంఘన చేస్తున్నారంటూ హై కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు అమరావతి రైతులు సీఆర్డీఏ పై ఏపీ హై కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు అమరావతి రైతులు. లింకు డాక్యుమెంట్ లు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ కు రమ్మనటంపై అమరావతి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మూడు నెలలలోగా అభివృధ్ది చేసిన ప్లాట్ లను ఇవ్వాల్సిందిగా నెల రోజుల కిందట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆధేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
రైతులు వారికి కేటాయించిన ప్లాట్ లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే సీఆర్డీఏ అందుకు అవసరమైన లింకు డాక్యుమెంట్ లతో సహా మిగిలిన న్యాయపరమైన పత్రాలను అందజేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. కోర్టు తీర్పు అమలు పరుస్తున్నట్లు అధికారులు నటిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు రైతులు. ఇక ఒకటి లేదా రెండు రోజుల్లో రైతుల పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.