హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి మేఘా గ్రూప్ కంపెనీ డ్రిల్ మెక్ దిగనుంది. 300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్న డ్రిల్ మెక్.. భవిష్యత్తు ప్రత్యామ్నాయ ఇంధనంగా హైడ్రోజన్ ను తయారు చేయనుంది. ఇడ్రోజెన స్టార్ట్ అప్ ప్రారంభించిన డ్రిల్ మెక్.. హైడ్రోజన్ ఉత్పత్తికి ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో ఫైరోలిటిక్ కన్వర్టర్ తయారు చేసింది.
ఈటెక్నాలజీతో హైడ్రోజన్ ఉత్పత్తి,పంపిణీ సులభతరం కానుండగా… హైడ్రోజన్ ఉత్పత్తితో పాటు జియోధర్మల్ ఎనర్జీ ను సైతం ఉత్పత్తి చేయనుంది డ్రిల్ మెక్. ప్రాసెస్ ఇంజినీరింగ్లో 30 ఏండ్లకు పైగా అనుభం ఉన్న ఇడ్రోజెన ఇంజినీర్లు కన్వర్టర్ను డిజైన్ చేసిన డ్రిల్ మెక్… ఎలాంటి కాలుష్య కారకాలను వినియోగించకుండానే పైరాలిసిస్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి జరుగనుంది. భద్రత,పర్వావరణ పరిరక్షణ,ప్రజలకు అందుబాటులోకి ఇందనం అనే లక్ష్యాలతో ఇంధనరంగంలో ముందడుగు వేసింది.
గ్రాఫైట్ను విరివిగా ఉపయోగించే ఆటోమోటివ్, కాస్మటిక్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి భారీ పరిశ్రమల్లో కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి ని నిలవరించే శక్తి సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి. కన్వర్టర్ ద్వారా హైడ్రోజన్ను అతి తక్కువ స్థలంలో అవసరం ఉన్న చోట పైపుల వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయవచ్చు తద్వారా రవాణా వ్యయాలను,స్టోరేజి సవాళ్ళను అధిగమించవచ్చు. ఈ టెక్నాలజీ సహజ వాయువు వాల్యూచైన్లో ఇమడగలుగుతుంది. అందరికీ అందుబాటులోకి రావడానికి అడ్డంకులుగా ఉన్న హైడ్రోజన్ పంపిణీ వ్యవస్థ లోపాన్ని కూడా అధిగమించవచ్చు.