మీరు ఏసీని కొనుగోలు చెయ్యాలనుకుంటున్నారా..? అయితే ఇలా మంచి ఫైవ్ స్టార్ ఏసీని ఎంచుకోండి..!

-

వేసవి కాలం మొదలైపోయింది. దీనితో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇంత వేడిని తట్టుకోవడం కాస్త కష్టమే అందుకనే చాలా మంది ఏసీ లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే ఏసీ లేని కొనుగోలు చేసేటప్పుడు చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి.

 

ఏసీ ని ఎలా ఎంచుకోవాలని..?, వేటిని దృష్టిలో పెట్టుకుని కొనాలి ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటారు. అయితే మీరు వేసిన కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఏసీ కొనేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అవండి. ఇక్కడ మీ యొక్క కూలింగ్ మరియు కరెంట్ ఆదాని దృష్టిలో పెట్టుకుని ఏసీలు ని ఎలా ఎంచుకోవాలి అనేది తెలియజేయడం జరిగింది. మరి ఆలస్యమెందుకు వాటికోసం చూసేయండి,.

నాయిస్ లెవెల్:

స్ప్లిట్ ఏసి ని కనుక కొనుగోలు చేశారు అంటే ఈ సమస్య ఉండదు. అదే ఒకవేళ మీరు విండో ఏసి కొనుక్కుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు నిద్ర పోయినా లేదంటే ఏదైనా పని చేసుకున్న కూడా కాస్త చికాకుగా ఉంటుంది. కాబట్టి స్ప్లిట్ ఏసి ని ఎంచుకోవడం మంచిది.

ఎయిర్ క్వాలిటీ:

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఏసీని కొనుగోలు చేసేటప్పుడు దానికి మంచి డీ హ్యూమిడిఫికేషన్ యూనిట్ ఉండేటట్లు చూసుకోండి ఇది మీ రూమ్ లో హ్యూమిడిటీని తగ్గిస్తుంది. కూలింగ్ పెంచి మిమ్మల్ని కంఫర్ట్ గా ఉండేటట్లు చేస్తుంది.

కూలింగ్ స్పీడ్:

అడ్జస్ట్ చేసే థర్మోస్టాట్ ఉండేటట్టు చూసుకోవాలి. అలానే రెండు ఫ్యాన్లు కూడా ఉండాలి. వేరబుల్ స్పీడు ఉండడం వల్ల మీకు నచ్చినట్టుగా ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే పవర్ కూడా తక్కువ అవుతుంది.

కంప్లైంట్లు:

మీరు ఏసీని కొనుగోలు చేసేటప్పుడు దీనిని చాలా బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని కొత్త ఏసీలు కి కూడా కంప్లైంట్ ఎక్కువగా వస్తాయి. కొనుగోలు చేసేటప్పుడు దానికి ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయా లేదా అనేది మీరు చూసుకోండి. కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏసిని కొనుగోలు చేసేటప్పుడు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు కొనుగోలు చేయండి.

వారెంటీ:

ఏసిని కొనుగోలు చేసినట్లు ఇది కూడా చూసుకోండి. వారెంటీ వుండే వాటిని కొనండి. దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చినా మళ్లీ తిరిగి రిపేర్లు చేయించుకోవడానికి అవుతుంది. లేదంటే డబ్బులు వృధానే.

కండెన్సర్ కాయిల్:

ఏసీ కండెన్సర్ కాయిల్స్ గాలిని చల్లగా మారుస్తాయి. కాపర్ కాయిల్స్ ఉన్నది అయితే త్వరగా చల్లదనం వస్తుంది అదే విధంగా సులభంగా వాటిని మెయింటైన్ చెయ్యచ్చు. పైగా లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ కాబట్టి మీరు ఏసిని కొనుగోలు చేసేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చెయ్యండి దీంతో మీరు మంచి ఏసిని ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news