తెలంగాణలో రేపు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి సమాచారం కావాలన్నా ఓటర్లు 1950 నంబర్ కి కాల్ చేయొచ్చు. అది ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్. లేదంటే 9223166166 నంబర్ కి ఎస్ఎంఎస్ చేసి తెలుసుకోవచ్చు. ఓటరు తన ఎపిక్ కార్డ్ నంబర్ ను టైప్ చేసి పై నంబర్ కు ఎస్ఎంఎస్ చేస్తే పోలింగ్ స్టేషన్ సమాచారం పంపిస్తారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ నాఓట్ అనే యాప్ ను డెవలప్ చేయించింది. ఆ యాప్ ద్వారా కూడా ఓటింగ్ కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సో… పోలింగ్ బూత్ సమాచారం తెలియదని టెన్షన్ పడకండి. ఫోన్ ద్వారా ఈజీగా పోలింగ్ బూత్ సమాచారం తెలుసుకొని రేపు ఉదయమే వెళ్లి ఓటింగ్ లో పాల్గొనండి.
17 స్థానాలకు తెలంగాణలో ఎన్నికలు..
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉంటుంది. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నిజామాబాద్ లో మాత్రం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 6 నుంచి 8 వరకు అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.