మరో ఆసియా దేశం రాజకీయ సంక్షోభంలో చిక్కుకోబోతోంది. ఇప్పటికే భారత్ దాయాది దేశం పాకిస్తాన్ రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా శ్రీలంకలో కూడా రాజకీయ సంక్షోభం తలెత్తనుంది. ఇప్పటికే శ్రీలంక దేశం తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కనీసం జనాల వద్ద కొందాం అంటే డబ్బులు లేవు, మార్కెట్లో సరుకులు కూడా లేని పరిస్థితి తలెత్తింది. దీంతో శ్రీలంక ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, ప్రధాని మహింద రాజపక్సేకు వ్యతిరేఖంగా ఆందోళనలను చేస్తున్నారు. వీరిద్దరు పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ‘ గో గోటబయ’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రజలు చేస్తున్న డిమాండ్లను పెద్దగా పట్టించుకోవడం లేదు గోటబయ రాజపక్సే పట్టించుకోవడం లేదు.
ఇదిలా ఉంటే శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రతిక్షానికి మద్దతు ఇస్తున్నారు. రాజధాని కొలంబోలో జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అద్యక్షుడి ఆస్తులను సీజ్ చేయాలని ప్రజలు అమెరికన్ ఎంబసీ ముందు ధర్నా కూడా చేశారు.