మోదీని ప్రశంసించడం అంటే వారిని అవమానించడమే: షాబాజ్ షరీఫ్, పాక్ ప్రతిపక్ష నేత

-

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని మోదీని, భారత విదేశాంగ విధానాన్ని ప్రశింసించడం  ప్రతిపక్ష నాయకులకు నచ్చడం లేదు. ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలపై పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ముస్లింలీగ్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ మోదీ ప్రశసించడంపై ఇమ్రాన్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పడిపోతే షాబాజ్ షరీఫ్ ప్రధాని కానున్నారు. 

తాజాగా భారత్ ను ఏ శక్తి నియంత్రించలేదని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై షాబాజ్ షరీఫ్ మండిపడ్డారు. ‘‘ ఆయన అబద్దాలకు అంతు ఉండదని.. అధికారం వ్యామోహంతో ఎన్ని కట్టుకథలైనా అల్లుతాడని అన్నారు. మోదీ విదేశాంగ విధానాన్ని ప్రశంసించడం అంటే సైనికుల త్యాగాలను, కాశ్మీరీల ఇబ్బందులను అవమానపరచడమే’’ అని షరీఫ్ అన్నారు. పార్లమెంటు, రాజ్యాంగం & కోర్టు పట్ల ఆయనకున్న “గౌరవం” దేశానికి తెలుసు అని  ఇమ్రాన్ ఖాన్ పై సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news