IPL SRH vs CSK : దుమ్ములేపిన‌ అభిషేక్ శ‌ర్మ‌.. స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ

-

వ‌రస‌గా రెండు మ్యాచ్ ల‌లో దారుణ‌మైన ఓట‌మి చ‌వి చూసిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఎట్ట‌కేల‌కు గెలుపు రుచి చూసింది. ఈ రోజు చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్.. గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. 155 ప‌రుగ‌లు టార్గెట్ ను సన్ రైజ‌ర్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ( 50 బంతుల్లో 75 ప‌రుగులు) దుమ్ములేపాడు. అంతే కాకుండా.. 5 ఫోర్లు, 3 సిక్స్ ల‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

అలాగే మ‌రో కేన్ విలియ‌మ్స‌న్ (32) కూడా రాణించాడు. రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 39 నాటౌట్ ) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివ‌ర్లో నికోల‌స్ పూర‌న్ ( 5 నాటౌట్ ) ముగించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై.. మొయిన్ అలీ (48), అంబ‌టి రాయుడు ( 27), ర‌వీంద్ర జ‌డేజా (23) రాణించారు. దీంతో చెన్నై నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి.. 154 ప‌రుగులు చేసింది. స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్లు.. సుంద‌ర్, న‌ట‌రాజ‌న్ త‌ల రెండు వికెట్లు తీశారు. మార్క్ర‌మ్, మార్కో జాన్సెన్, భూవ‌నేశ్వ‌ర్ ఒక్కో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news