టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అద్యక్షతన ఈరోజు ఢిల్లీలో ధాన్యం కొనుగోలు చేయాలని దీక్షను చేశారు. ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లో తేల్చాలని కేంద్రాన్ని హెచ్చరిస్తూ డెడ్ లైన్ విధించారు. తాజాగా కేంద్రం కూడా టీఆర్ఎస్ దీక్షపై స్పందించింది. పారాబాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయలేమని మరోసారి తేల్చిచెప్పింది కేంద్రం. 2021-22 యాసంగికి సంబంధించి ధాన్యం సేకరణ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్రం పంపించలేదని కేంద్రం వెల్లడించింది. ప్రతిపాదనలను పంపించాలని ఎన్నోసార్ల కోరినా స్పందించలేదని వెల్లడించింది. పారాబాయిల్డ్ రైస్ ను ఇవ్వమని… ‘రా’ రైస్ మాత్రమే ఇస్తామని గతంలో తెలంగాణ చెప్పిందని తెలిపింది. ఎఫ్సీఐ దగ్గర మూడేళ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ ఉన్నాయని కేంద్ర వెల్లడించింది. ఇప్పటికి రెండు సార్లు సమావేశాలు నిర్వహించామని.. అయినా ఇప్పవరకు ధాన్యం సేకరణ ప్లాన్ పంపించ లేదని కేంద్ర ఆహార పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే అన్నారు. ఒకవేళ కొనుగోలు ప్లాన్ పంపిస్తే… గన్నీ బ్యాగులు, ఇతర అవసరాల కోసం సామాగ్రి పంపించేవారమని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ధాన్యాన్ని కొంటున్నామని ఆయన అన్నారు. అయితే పంజాబ్ నుంచి కూడా పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయడం లేదని సుధాంశు పాండే తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి వివక్ష పాటించడం లేదని ఆయన అన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో ఎంఓయూ కూడా చేసుకుందని ఆయన వెల్లడించారు.
టీఆర్ఎస్ దీక్షపై స్పందించిన కేంద్రం…. బాయిల్డ్ రైస్ కొనమని స్పష్టం చేసిన కేంద్రం
-