హిందీ చిత్రసీమకు RGV సూటి ప్రశ్న..బాలీవుడ్‌ను ఏలేది సౌత్ సినిమా!

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ RGV ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ గా ఉంటాడు. ప్రతీ విషయంలో తనకు నచ్చిన అభిప్రాయాన్ని ట్వి్ట్టర్ వేదికగా ట్వీట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రకరకాల వివాదాలకు ఆజ్యం పోస్తు నిత్యం మీడియా హెడ్ లైన్స్ లో ఉంటారు. తాజాగా KGF Chapter2 సక్సెస్ గురించి ప్రస్తావిస్తూ బాలీవుడ్ ను ఏకి పారేశాడు ఆర్జీవీ.

‘ఒకప్పుడు బాలీవుడ్ అంటే వేరు..ఇప్పుడు బాలీవుడ్ వేరు. ప్రస్తుతం సౌత్ సినిమాలు హిందీలోనే ఎక్కువగా హిట్ అవుతున్నాయి’ అని పేర్కొన్న వర్మ..ఈ విషయమై బాలీవుడ్ ఏ విధంగా ఆలోచిస్తుందని సూటి ప్రశ్న వేశారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్ సినిమాల లిస్ట్ షేర్ చేశాడు.

అందులో హిందీ సినిమాల పేర్లు మూడు, నాలుగు, ఐదు ..తర్వాత స్థానాల్లో ఉండగా, బాహుబలి2, కేజీఎఫ్ 2 మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.  హిందీ సినిమా చరిత్రలో ఒక కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కేజీఎఫ్ 2’, తెలుగు డబ్బింగ్ చిత్రం ‘బాహుబలి 2’ ఇంత పెద్ద ఓపెనర్‌గా నిలిచాయని దాని గురించి హిందీ చిత్ర సీమ ఆలోచిస్తుందని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించారు.

RGV చేసిన ఆ ట్వీట్ ప్రజెంట్ నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ విషయమై తమకు నచ్చిన రీతిలో స్పందిస్తున్నారు. ఈ ప్రశ్నతో వర్మ బాలీవుడ్ ను వర్మ ఏకి పారేశాడని నెటిజన్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సౌత్ సినిమా రేంజ్ ను బాలీవుడ్ ఒప్పుకోవాలని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ ను ఏలేది సౌత్ సినిమాలే అని మరి కొందరు అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ RGV గురించి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ తనకు ద గాడ్ ఫాదర్ ఫిల్మ్ ఇష్టమని, RGV మేకింగ్ అన్నా ఇష్టమని, ఆయన సినిమాల ప్రభావం తనపై ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news