కేసీఆర్ ఓ రిఫార్మర్.. ట్రాన్స్ ఫార్మర్ గా ఉండే నాయకుడు : కేటీఆర్

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ దళిత బంధు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఓ రిఫార్మర్.. ట్రాన్స్ ఫార్మర్ గా ఉండే నాయకుడు అని కొనియాడారు. 65 ఏండ్లలో కానీ పనులు ఎన్నో ఆరు ఏండ్లలో చేసుకున్నామని.. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతు చనిపోతే వారి కుటుంబాలకు రైతు బీమా ఇస్తు అండగా ఉంటున్నాడని కేసీఆర్ పై ప్రశంశలు కురిపించారు.

సమాజంలోని అసమానతలు తొలిగి సమానత్వం కలిగించేలా ప్రభుత్వం పని చేస్తుందని.. దేవుడు పుట్టించినప్పుడు కులం పెట్టలేదు.. అందరికి ఓకే శరీరం ఇచ్చాడన్నారు. తెలివి టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదని.. మనమే కులం, మతం అని పుట్టించుకుని పంచాయితీలు పెట్టుకుంటున్నామని అగ్రహించారు. దేవుడి సృష్టించిన మనుషులే కులం, మతం అంటూ ఘర్షణలు పెట్టుకుని దిగ జారిపోతున్నామన్నారు.

1985 భారత దేశం, చైనా ఓకేలా ఉండేవి.. 35 ఏండ్లలో చైనా వాళ్ళు తెలివిగా ఉండి అమెరికా జపాన్ లతో పోటీ పడి దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. మన ఎకానమీ కంటే ఆరురెట్లు చైనా ఎకానమీ ముందు స్థానంలోకి వెల్లిందని.. చైనాలో కులం, మతం పంచాయితీ లు వదిలి పెట్టుబడులు అభివృద్ధి వైపు అడుగులేస్తున్నారని మోడీ సర్కార్ కు చురకలు అంటించారు.
మత పిచ్చి, మత గజ్జితో దేశంలో అభివృద్ధి కుంటుబడిందన్నారు. ఒక విప్లవాత్మక మార్పుగా దళిత బంధు పథకం కేసీఆర్ తెచ్చారని.. 20 లక్షల కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వండి అని బండి సంజయ్ , మోదీ ని కోరుతున్నానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news