ఈ స్కీమ్ అకౌంట్ కలిగి వున్నారా..? అయితే రూల్స్ మారాయి చూసుకోండి..!

-

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చాయి. అయితే ఈ స్కీమ్స్ వలన చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు. అయితే వాటిలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన ఎంతో మందికి ఎన్నో లాభాలు కలుగుతున్నాయి.

money
money

ట్యాక్స్ బెనిఫిట్స్ మొదలు వడ్డీ దాకా ఈ స్కీమ్ మనకి హెల్ప్ అవుతుంది. పైగా మీ డబ్బులు సేఫ్. ఆర్థిక భద్రత లభిస్తుంది. మీ ఆడపిల్ల ఉన్నత చదువులు, పెళ్లి వంటి వాటికి డబ్బుల కొరత ఉండదు. అందుకే ఆడపిల్ల తల్లిదండ్రులు ఈ స్కీమ్ ని ఓపెన్ చేస్తారు. అయితే ఈ స్కీమ్ రూల్స్ ఇది వరకు లాగ లేవు. కొన్ని మార్పులు జరిగాయి. మరి ఇక ఆలస్యం లేకుండా వాటి కోసం చూద్దాం.

  1. ఇది వరకు పాప చనిపోతే అప్పుడు సుకన్య సమృద్ధి అకౌంట్ ని మూసేసేవారు. లేదా ఇల్లు మారినప్పుడు కూడా. కానీ ఇప్పడు ప్రాణాంతక వ్యాధులను కూడా ఇందులో చేర్చారు. కనుక సుకన్య అకౌంట్‌ను మెచ్యూరిటీ కన్నా ముందే క్లోజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇంటి పెద్ద మరణించిన సరే అకౌంట్ ప్రిక్లోజ్ చేసుకోవచ్చు.
  2. ట్యాక్స్ బెనిఫిట్స్ గతంలో కేవలం ఇద్దరు ఆడ పిల్లల పేరుపై ఓపెన్ చేసిన రెండు అకౌంట్లకు వర్తించేవి. మూడో అమ్మాయి ఉండి స్కీమ్ లో చేరిన ట్యాక్స్ బెనిఫిట్ ని పొందడానికి అయ్యేది కాదు. మూడు అకౌంట్లపై కూడా పన్ను మినహాయింపు పొందొచ్చు ఇప్పుడు కానీ కవలలు అవ్వాలి.
  3. ప్రతి ఏడాది కచ్చితంగా కనీసం రూ.250 అయిన డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమమ్ బ్యాలెన్స్ చెల్లించకపోతే అకౌంట్ డిఫాల్ట్ అవుతుంది. ఒకవేళ అకౌంట్ మళ్ళీ యాక్టివేట్ చేసుకోకపోయినా కూడా ప్రస్తుతం డిపాజిట్ అమౌంట్‌పై మెచ్యూరిటీ దాకా వడ్డీ వస్తుంది. కానీ అప్పుడు అలా లేదు. మార్పు వచ్చింది.
  4. గతంలో పదేళ్లు వయసు వచ్చిన తర్వాత అమ్మాయిలకు అకౌంట్ బాధ్యతలు అప్పగించేవారు. ఇప్పుడు మాత్రం అమ్మాయికి 18 ఏళ్లు రావాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news