తెలంగాణ ధనిక రాష్ట్రం..ఏపీ పేద రాష్ట్రం అని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. జగన్ పక్కా బిజినెస్ మాన్..పెద్ద గేబ్లింగ్ ఆడుతున్నాడని.. రాష్ట్రం పై శుక్రుడు వక్రంగా చూస్తున్నాడు..శుక్రుడు ఎవరో నన్ను అడగొద్దని పేర్కొన్నారు. విద్యుత్ పై జగన్ కి ముందు చూపు లేదు.. ఇంతకు ముందు రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదన్నారు.
తెలంగాణలో పవర్ కట్ లేదు… కానీ ఏపి లో కరెంట్ కట్ విపరీతంగా ఉందని.. విద్యుత్ కష్టాలు నుంచి బయట పడదానికి ఎన్ని యుగాలు పడుతుందో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపిలో ఫైనాన్సిల్ మేనేజ్ మెంట్ లేదని… ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వల్ల మంచా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేడా అనే మథనం మధ్యతరగతిలో ప్రారంభమైందని.. జగన్ ఎంత కాలం బటన్స్ నొక్కి డబ్బులు ఇవ్వగలడో అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మోదికి జగన్ ఇచ్చిన వినతి పత్రంలో ప్రత్యేక హోదా అంశం లేదు.. కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు మోదీ కన్నుల్లోనే నడుస్తున్నాయని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.