ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు కూడా అక్కడ లేరు. ఎవరూ లేకుండా… ఈవీఎంలను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో అర్ధరాత్రి ఈవీఎంలు కలకలం లేపాయి. జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఈవీఎంలను తరలించారు. అది కూడా ఆటోలో. అర్ధరాత్రి జగిత్యాల తహసీల్దార్ కార్యాలయానికి ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఈవీఎంలను తీసుకొచ్చారు. వీటిని ఆటోలో తరలిస్తుండగా గమనించిన స్థానికులు ఆటోను ఆపి ఆటోడ్రైవర్ ను నిలదీశారు. అయితే.. ఆ ఈవీఎంల తరలింపుపై ఆటో డ్రైవర్ పొంతన లేని సమాధానాలు చెప్పాడు.
ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు కూడా అక్కడ లేరు. ఎవరూ లేకుండా… ఈవీఎంలను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలో వాటిని తరలిస్తుండగా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అవి డెమో ఈవీఎంలు అని వాళ్లు చెబుతున్నప్పకీ.. డెమో ఈవీఎంలు అయితే.. ఇంత అర్ధరాత్రి పూట తరలించాల్సిన అవసరం ఏంటని స్థానికులు అనుమానిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వస్తే గానీ ఏం చేయలేం.