తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్పీడ్ పెంచిన బిజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో టాప్ గేర్ వేసి మంచి ఫలితాలను రాబట్టింది.. అదే ఊపులో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది.. ఇందుకోసం మూడు ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేసింది.. ముందస్తు వ్యూహాలతో వార్ జోన్ లోకి దిగేసింది.. ఇంతకీ కమలం పార్టీ వ్యూహమేంటి..? నేతల్లో జరుగుతున్న చర్చేంటో చూద్దాం..
తెలంగాణాలో వచ్చేఏడాది మార్చి నాటికి మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి..అందులో రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలుగాక.. ఒకటి గ్రాడ్యుయేట్ స్థానం.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్థానాలతో పాటు.. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.. ఇందుకోసం ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.. అయితే ఈ మూడు స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కమలం పార్టీ వ్యూహాలను రచిస్తోంది..
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో తమకు గట్టి పట్టుందని బిజేపీ భావిస్తోంది..ఆ రెండు సీట్లలో పాగా వెయ్యాలని బిజేపీ పక్కా ప్లాన్ ఇప్పటి నుంచే వేస్తోందట..అందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.. ఆ కమిటీలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేపాల్వాయి హరీష్, ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంచందర్ రావులతో పాటు మరో ఇద్దరు సభ్యులుగా ఉన్నారు.. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు సైతం పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారట. ఆర్దిక స్థితిగతులు, నేతల బలాబలాలు అంచనా వేసిన తర్వాతే అభ్యర్దులను ఎంపిక చెయ్యాలని బిజేపీ భావిస్తోంది..
బలం ఉన్నచోట ఆదిపత్యాన్ని ప్రదర్శించాలని కమలం పార్టీ అగ్రనేతలు రాష్ట నేతలకు పలు సూచనలు చేస్తున్నారట.. ఎక్కడానిర్లక్ష్యంగా ఉండొద్దని, అధికార కాంగ్రెస్ తో పాటు.. బిఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలని సూచిస్తోందట.. దీంతో బిజేపీ కీలక నేతలు ప్రత్యేక స్టాటజీతో ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు.. బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి, ఈటెలవంటి నేతలు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టాట్ చేశారని పార్టీలో చర్చ నడుస్తోంది.. ఈ మూడు స్థానాల్లో బిజేపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో చూడాలి..