రాజ్ భవన్ లో గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందులో కుల గణన, మూసి ప్రక్షాళన పై గవర్నర్ తో రేవంత్ చర్చించారు. మూసి ప్రక్షాళనలో పేదలు నష్టపోకుండా చూడాలి.. పరిహారం అందించడంలో ఉదారంగా ఉండాలని సీఎంకి చెప్పారు గవర్నర్. ఇందులో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చినట్టు చెప్పిన సీఎం.. మరికొంత మందికి పరిహారం అందించడంలో ఇబ్బంది లేదని.. పేదలను సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులసర్వే తీరును గవర్నర్ కు వివరించిన సీఎం.. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులసర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవనుందని తెలిపారు సీఎం. 2025 చేపట్టే దేశవ్యాప్త జనగణలో తెలంగాణ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులసర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్ ను ఆహ్వానించారు.