బిజినెస్ ఐడియా: ఎరువుల వ్యాపారంతో లాభాలే లాభాలు… రిస్క్ కూడా ఉండదు..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ బిజినెస్ మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. దీనిని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలనుకునే వాళ్ళకి ఈ బిజినెస్ బాగుంటుంది.

 

ఈ మధ్య కాలంలో ఎరువుల వ్యాపారానికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళు మంచిగా ఆదాయాన్ని పొందుతున్నారు. పంట పొలాల్లో రైతులు భాస్వరం, యూరియా, నైట్రేట్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. పట్టణంలో అయినా పల్లెల్లో అయినా ఈ వ్యాపారం చేయడానికి అనుకూలంగానే ఉంటుంది.

పైగా ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి అందిస్తోంది. మార్కెటింగ్ తో పాటు ఎరువుల పై అవగాహన ఉంటే ఈ వ్యాపారాన్ని చేయొచ్చు. ఎరువుల కి ఈ సీజన్ ఆ సీజన్ అని ఏమీ లేదు ఎప్పుడైనా సరే ఎరువులు బిజినెస్ బాగుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాపారాన్ని మొదలు పెడితే అత్యధిక ఆదాయాన్ని పొందొచ్చు.

వ్యవసాయ శాఖను లేదా సమీపంలో ఎరువుల దుకాణం చేసేవారిని రైతులు సంప్రదిస్తూ ఉంటారు. మీ బడ్జెట్ ప్రకారం మీరు చిన్న ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసుకుని సేల్ చేయొచ్చు. ఈ వ్యాపారం చేయడానికి మూడు నుండి ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. 30 నుండి 60 శాతం వరకూ లాభాలను ఎరువుల వ్యాపారం ద్వారా పొందొచ్చు. ఇలా ఎరువుల వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news