Anil Kapoor: దక్షిణాదిలో ఎప్పుడూ మంచి చిత్రాలే చేస్తారు..బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసల వర్షం

-

బాలీవుడ్ ను ప్రస్తుతం దక్షిణాది చిత్ర సీమ ఏలుతున్నది. ఇటీవల విడుదలైన చిత్రాలు బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ను అందుకుంటున్నాయి. ‘పుష్ప, RRR, KGF2’ పిక్చర్స్ రికార్డుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ తారలు సైతం ఈ చిత్రాలు చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఓ ఈ సినిమా ఫంక్షన్ లో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల కపూర్ దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమ వాళ్లు చాలా మంచి చిత్రాలు చేస్తారని చెప్పారు అనిల్ కపూర్. తనకు ఈ విషయం చాలా ముందు నుంచే తెలుసని, తను హీరోగా నటించిన తొలి చిత్రం తెలుగు భాషా చిత్రమని చెప్పారు. అక్కడే తనకు ప్రొఫెషనలిజం అంటే ఏంటో తెలిసిందని గుర్తుచేసుకున్నారు. బాపు దర్శకత్వంలో తను తొలి పిక్చర్ చేశానని, ఆ తర్వాత కన్నడ భాషలో సినిమా చేశానని అది మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిందని చెప్పారు.

అలా తాను దక్షిణ భారతదేశానికి చెందిన భాషల్లో చాలా చక్కటి సినిమాల్లో చేశానని అనిల్ కపూర్ చెప్పుకొచ్చారు. దక్షిణ భారతదేశంలో ఎప్పుడూ చక్కటి కథలున్న సినిమాలు తీశారని, తీస్తారని, భవిష్యత్తులోనూ తీస్తారని అన్నారు.

తనకు ఈ విషయంలో ఎటువంటి సర్ ప్రైజ్ లేదని, తను గొప్ప దర్శకుల విజన్ ను గౌరవిస్తానని పేర్కొన్నారు. బీ టౌన్ స్టార్ హీరో సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపైన ఇటువంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news