టీడీపీకి జనసేన వల్లే నష్టం జరిగింది.. అది వైసీపీకి లాభం చేకూర్చింది.. జోస్యం చెప్పిన సీనియర్ నేత

-

సామాన్య జనాల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరి నోట చూసినా ఇదే మాట. కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అయితే.. ఇదిగో ఈ పార్టీ వల్ల ఈ పార్టీకి నష్టం.. ఈ పార్టీకి లాభం. దీని వల్ల ఈ పార్టీ గెలవబోతోంది. ఈ పార్టీకి దీని దెబ్బ పడింది.. అంటూ తమ విశ్లేషణలను చెప్పుకుంటున్నారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 11నే ముగిసింది. ఎన్నికలయితే ముగిశాయి కానీ ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ ఓడిపోతుందని.. పోలింగ్ కంటే ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. ఏ పార్టీ గెలిస్తే ఏం జరుగుతుంది. ఏ పార్టీ ఓడిపోతే ఏం జరుగుతుంది. అసలు ఏ పార్టీ ఎందుకు గెలుస్తుంది? ఏ పార్టీ అయినా ఎందుకు ఓడిపోతుంది.. అంటూ అంచనాలు వేసుకుంటున్నారు. ఇలా… ఎవరి అంచనాలు వాళ్లు వేసుకుంటున్నారు. సామాన్య జనాల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరి నోట చూసినా ఇదే మాట. కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అయితే.. ఇదిగో ఈ పార్టీ వల్ల ఈ పార్టీకి నష్టం.. ఈ పార్టీకి లాభం. దీని వల్ల ఈ పార్టీ గెలవబోతోంది. ఈ పార్టీకి దీని దెబ్బ పడింది.. అంటూ తమ విశ్లేషణలను చెప్పుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ వేత్త హరిరామ జోగయ్య ఏపీ ఎన్నికలపై సరికొత్త జోస్యం చెప్పారు. ఆయన విశ్లేషణను చూస్తే అరె.. నిజమే కదా అనిపిస్తుంది. దీంతో రెండు ప్రధాన పార్టీల్లోనూ ఆయన జోస్యం చర్చకు దారి తీసింది.

ఏ పార్టీకి 90 సీట్లకు మించి రావు..

రెండు ప్రధాన పార్టీలయినటువంటి టీడీపీ, వైఎస్సార్సీపీలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాదని పెద్ద బాంబు పేల్చారు ఆయన. అంతే కాదు.. మధ్యలో వచ్చిన జనసేన పార్టీ వల్ల ఒక్క టీడీపీకే నష్టమట. వైఎస్సార్సీపీకి ఎటువంటి నష్టం లేదట. జనసేన వల్ల టీడీపీకి వెళ్లాల్సిన ఓట్లే గండి పడ్డాయట. పసుపు – కుంకుమ, ఇంకేదో పథకాలు టీడీపీకి ఓట్లు కురిపిస్తాయని టీడీపీ భావిస్తున్నా.. అది జరగదని ఆయన చెబుతున్నారు. దాంతో పాటు వైఎస్సార్సీపీ ప్రకటించిన నవరత్నాలకు కూడా ప్రజలు ఆకర్షితులు కాలేదని.. ఏ పార్టీకి కూడా ఈసారి 90 సీట్లకు మించి రావని ఆయన జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news