తల్లికడుపులో ట్విన్స్ ఫైట్.. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో గుర్తింపు.. వీడియో వైరల్

1914

వామ్మో.. పిల్లలు మరీ ఇంత స్పీడా? పుట్టకముందే వీళ్లు ఇంత స్పీడ్‌గా ఉన్నారేంటి.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోసారి స్కాన్ తీసినప్పుడు ఇద్దరు ఒకరిని మరొకరు కౌగించుకొని ఉన్నారట.

ట్విన్స్ పుట్టడం కామనే. కానీ.. తల్లి కడుపులో ఉన్నప్పుడే ట్విన్స్ ఒకరిని మరొకరు కొట్టుకుంటే ఎలా ఉంటది. ఏంది ఈ వింత అంటారా? అవును.. తల్లి కడుపులో ఉండగానే ట్విన్స్ ఒకరిని మరొకరు కొట్టుకున్నారు. బాక్సింగ్ చేశారు. ఈ విషయం అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తుంటే తెలిసింది. డాక్టర్ ఆ మహిళకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తుండగా కడుపులోని ట్విన్స్ కొట్టుకోవడం చూసిన ట్విన్స్ తండ్రి తన మొబైల్‌లో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Identical Twins Fighting In Their Mother's Womb video goes viral

వామ్మో.. పిల్లలు మరీ ఇంత స్పీడా? పుట్టకముందే వీళ్లు ఇంత స్పీడ్‌గా ఉన్నారేంటి.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోసారి స్కాన్ తీసినప్పుడు ఇద్దరు ఒకరిని మరొకరు కౌగించుకొని ఉన్నారట. ఇద్దరూ అమ్మాయిలే. ఈ ఘటన చైనాలో గత సంవత్సరం చోటు చేసుకున్నప్పటికీ.. దానికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది. వాళ్లు పుట్టాక వాళ్లకు స్ట్రాబెర్రీ, చెర్రీ అని పేర్లు కూడా పెట్టారట. తల్లికడుపులో ఉన్నప్పుడు వాళ్లు కొట్టుకున్నప్పటికీ.. భూమ్మీదికి వచ్చాక మాత్రం వాళ్లు కొట్టుకోవట్లేదట.