ఏపీలోని కృష్ణా జిల్లాలో మొన్న జరిగిన ఎన్నికల్లో విచిత్రం చోటు చేసుకున్నది. నూజివీడులోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటేసిన ఓటర్లకు, పోలైన ఓట్లకు మధ్య 50 ఓట్ల వ్యత్యాసం వచ్చింది. పోలింగ్ రోజున ఉదయమే మాక్ పోలింగ్ నిర్వహించిన పోలింగ్ అధికారులు.. ఆ ఓట్లను ఈవీఎం నుంచి తొలగించడం మరిచిపోయారు.
దీంతో ఆ ఈవీఎంలో 50 ఓట్లు అదనంగా పడ్డాయి. దీనిపై విచారణ చేసిన ఎన్నికల కమిషన్.. జిల్లా సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దాంతో పాటు ఆ పోలింగ్ బూత్‌కు బాధ్యత వహించే నూజివీడు ఎమ్మార్వో తేజేశ్వరరావును సస్పెండ్ చేసింది. మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని సబ్ కలెక్టర్‌తో పాటు పోలింగ్ అధికారులపై ఈసీ మండిపడింది. దీంతో ఇది ఏపీలో చర్చనీయాంశమైంది.