తెలంగాణలో ఫోర్త్ వేవ్ అస్సలు రాదు: డి హెచ్ శ్రీనివాసరావు

-

తెలంగాణలో ఆర్ వ్యాల్యూ 5% మాత్రమేనని… కానీ మాస్క్ ధరించాలి…ఫోర్త్ వేవ్ తెలంగాణలో రాదని పేర్కొన్నారు డిహెచ్ శ్రీనివాస్ రావు. సిరో సర్వే ప్రకారం జనవరి 4వ తేదీన నిర్వహించారన్నారు. 14179 మంది యాంటీ బాడీస్ పరీక్ష చేశారు. సాధారణ ప్రజల్లో 92.9% ఉన్నాయని వెల్లడించారు. హెల్త్ కేర్ వర్కర్క్స్ 93% పాజిటివిటి ఉంది. భద్రాద్రిలో 89.2 యాంటీ బాడీస్ డెవలప్ అయ్యాయి…హైదరాబాద్ 97 % ప్రజల్లో యాంటీ బాడీస్ ఉన్నాయని చెప్పారు.

 

వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్లలో 98%, తీసుకోని వాళ్లలో 77% యాంటీ బాడీస్ ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత బాగా పెరిగింది…రాజకీయ నాయకులు ర్యాలీలు- సభలు – సమావేశాలు సాయంత్రం లేదా ఉదయం పెట్టుకోవాలని సూచనలు చేశారు.నాయకుల వెంట వందలాది మంది ప్రజలు కార్యకర్తలు ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో కరోనా నిబంధనలు ఎత్తివేయలేదు…మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమాన పోలీసులు విధిస్తారని హెచ్చరించారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిహెచ్ శ్రీనివాసరావు.

Read more RELATED
Recommended to you

Latest news