జనాలకు ఎంటర్ టైన్మెంట్ ఇచ్చే వాటిల్లో సినిమాలు, క్రికెట్ తప్పక ఉంటాయని చెప్పొచ్చు. మెజారిటీ ప్రజలు క్రికెట్, సినిమాలను బాగా ఇష్టపడుతుంటారు. ఇవి రెండు కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. చాలా బాగుంటుంది కదా.. కానీ, అది అంత ఈజీగా అయ్యే పని కాదు. కాగా, క్రికెటర్స్ కూడా సినిమాలను అభిమానిస్తుంటారన్న సంగతి మనకు తెలుసు.
డేవిడ్ వార్నర్, తదితర క్రికెటర్స్ కొత్త సినిమాలు విడుదలైతే చాలు..అవి చూసేసి వాటిలోని సిగ్నేచర్ స్టెప్స్ చేస్తూ, డైలాగ్స్ చెప్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. కాగా, తాజాగా RCB టీ 20 లీగ్ సందర్భంగా బెంగళూరు టీమ్ క్రికెటర్స్ కోసం KGF2 ఫిల్మ్ ప్రత్యేకంగా ఒక షో వేశారు నిర్వాహకులు.
శాండల్ వుడ్ కు చెందిన యశ్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన కేజీఎఫ్ 2ను దేశవ్యాప్తంగా సినీ అభిమానులు విశేషంగా ఆదరిస్తున్నారు. కాగా, పిక్చర్ ను బెంగళూరు క్రికెటర్స్, సిబ్బంది బాగా ఎంజాయ్ చేశారు.
ఈ సినిమా చూసిన తర్వాత తమ స్పందనను వారు తెలిపారు. బెంగళూరు టీమ్ కెప్టెన్ డుప్లెసిస్..కు అధీర గెటప్ బాగా నచ్చింది. ఈయన విరాట్ కోహ్లీ, హర్షల్ పటేల్, సిరాజ్ లతో కలిసి అధీర గెటప్ బ్యాక్ గ్రౌండ్ తో ఓ వీడియో షేర్ చేశాడు. ట్విట్టర్ ఆ వీడియో బాగా వైరలవుతోంది. చాప్టర్ 1 కంటే చాప్టర్ 2 చాలా బాగుందని, రాకింగ్ స్టార్ యశ్ గడ్డం అయితే తనకు చాలా బాగా న్చిందని మహమ్మద్ సిరాజ్ తెలిపారు.
సినిమా ప్రొడక్షన్ భారీ స్థాయిలో ఉందని, తాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్’ పిక్చర్ కోసం వెయిట్ చేస్తున్నానని హర్షల్ పటేల్ అన్నారు. సినిమా చాలా బాగుందని హేజిల్ వుడ్ అనగా, కేజీఎఫ్ చాప్టర్ 2లో మొదటి అరగంట, చివరి అరగంట అదిరిపోయాయని సంజయ్ బంగర్ తెలిపారు.
రెండు పార్టులు చూస్తే మస్తు మజా వస్తుందని, తాను చాప్టర్ 2 చూడటాని కంటే కొంచెం ముందు చాప్టర్ 1 చూశానని, చాలా బాగుందని అనుజ్ రావత్ చెప్పారు. మొత్తంగా బెంగళూరు ఆటగాళ్లు KGF2 పిక్చర్ చూసి రిలాక్స్ అవడమే కాదు..న్యూ ఎనర్జీ పొందారని చెప్పొచ్చు.
A special evening, where our players enjoyed watching the blockbuster movie KGF Chapter 2 at the #RCB bio bubble, thanks to @hombalefilms. Watch the reactions from our stars as they review the movie.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #ನಮ್ಮRCB #RCBxHombale #KGF2 pic.twitter.com/JUBUH5J7q3
— Royal Challengers Bangalore (@RCBTweets) April 21, 2022