వేగంగా చదువుకోవాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి..!

-

ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునేటప్పుడు ఆసక్తిని కోల్పోతారు. కానీ నిజానికి చిన్న చిన్న టెక్నిక్స్ ని చదువుకునే విద్యార్థులు ఫాలో అయితే మంచిగా వాళ్ళు చదువుకోడానికి అవుతుంది. అలానే మంచి మార్కులు కూడా సాధిస్తారు.

అయితే ఈ టెక్నీక్స్ ని కనుక విద్యార్థులు చదువుకునేటప్పుడు ఫాలో అయ్యారంటే కచ్చితంగా వేగంగా చదువుకోడానికి అవుతుంది మరి ఇక మనం ఎటువంటి ఆలస్యం లేకుండా విద్యార్థులు ఎలాంటి టిప్స్ ని ఫాలో అయితే బాగుంటుంది అనేది చూద్దాం.

చదివే విధానం మార్చుకోవాలి:

ఎప్పుడూ ఒకే విధంగా చదువుకోవడం అస్సలు మంచిది కాదు. మనం ఎప్పుడూ ఒకే రకంగా చదివితే వేరే విషయాల పైకి ఆలోచన వెళ్లి పోతుంది. అందుకనే ప్రతి సారి మనం చదివే విధానం మార్చుకుంటూ ఉండాలి. బ్రెయిన్ ఆలోచించే ప్రాసెస్ అనేది ఇలా చదవడం వల్ల పెరుగుతుంది కాబట్టి ఎప్పుడూ ఒకే పద్ధతిలో కాకుండా మర్చి ప్రయత్నం చేయాలి దీంతో బాగా చదవచ్చు.

45-15 టెక్నిక్:

ఎప్పుడూ కూడా 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు 50 నిమిషాల కంటే తక్కువ సేపు చదవాలి. ఎక్కువ గంటలు చదవడం వల్ల బ్రెయిన్ అలసిపోతుంది. కాబట్టి 45 నిమిషాలు చదివి 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చి మళ్ళీ 45 నిమిషాలు చదువుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ రిఫ్రెష్ అయి ఎక్కువగా పనిచేస్తుంది.

కీ పాయింట్స్ రాసుకోవడం:

ఏదైనా సబ్జెక్టును చదివేటప్పుడు అందులో ఉండే కీ పాయింట్స్ ని ఒక దగ్గర రాసుకోవాలి. కీ పాయింట్స్ ని ఒక దగ్గర రాసుకోవడం వల్ల బాగా గుర్తుంటాయి.

చదివింది ఎవరికైనా చెప్పండి:

మీరు చదివింది ఎవరికైనా ఎక్స్ప్లైన్ చేస్తే.. ఆ టాపిక్ మీకు బాగా గుర్తుంటుంది. ఒకవేళ కనుక ఎవరూ లేకపోతే మీకే చెప్పుకోవడం మంచిది ఇలా మీరు చదివితే కూడా వేగంగా చదువుకోవచ్చు. పైగా బాగా గుర్తుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news