శకుని అంటే మనం దుష్టుడుగానే మైండ్ లో ఫిక్స్ అయ్యాం.. కానీ మహాభారతంను పూర్తిగా అర్థంచేసుకుంటే.. మనం శకుని మీద ఉన్న ఒపీనియన్ మార్చుకోవచ్చేమే.. ప్రొఫిషనల్ సెల్ఫిస్ గా కూడా ఈతరం వారు శకునిని ఉదాహరణకు తీసుకుంటారు. అవును తెలివైన స్వార్థపరుడు. కౌరవుల పక్షాన నిలబడి.. జూదరూపంలోని దుర్మార్గుల వినాశనానికి కారణమైనవాడు శకుని. అయితే శకునితో అలా చేయించిన సూత్రధారి కృష్ణుడు. ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఏర్పాటు చేసిన కర్మ సాధనంగా ఉపయోగపడిన వ్యక్తి శకుని. అయితే శకునికి ఎక్కడా ఆలయాలు లేవు.. పూజలు చేసే భక్తులు లేరూ. కానీ మన దేశంలో కేవలం ఆ ఒక్క ప్రదేశంలోనే.. శకుని మామకు ఆలయం కట్టి కొలుస్తున్నారు.
కేరళ రాష్ట్రంలో శకునికి ఆలయం నిర్మించి భగవంతునిగా పూజిస్తున్నారు. పాండవుల అజ్ఞాతవాస సమయంలో కౌరవులు వారికోసం దేశాలన్నీ గాలించి వారిని తుదముట్టించాలని అనుకున్న సగంతి మనకు తెలిసిందే.. అందుకోసం ఈనాటి కేరళ ప్రాంతంలో ‘పగుత్తీశ్వరమ్’ ప్రాంతంలో ఆయుధాలు రహస్యంగా దాచివుంచారు. ఆ ప్రాంతమే వాడుకలో ‘పవిత్రేశ్వరం’ గా పిలుస్తున్నారు.. పవిత్రేశ్వరం’ సరిహద్దులలో…’మాయంగోడుమాలన్ సరవుమలనడా’ అనే ఆలయం ఉంది.
ఈ ఆలయంలో ప్రధాన దైవం ‘శకుని’. భీష్ముని పై ప్రతీకారం కోసం తాను చేసిన పాపాలకు ఆ శకుని, ప్రాయశ్చిత్తంగా ఈ ఆలయంలోని ఈశ్వరుడి గురించి తపస్సు చేశాడని, అప్పుడు పరమశివుని అనుగ్రహంతో మోక్షం పొందాడని స్థలపురాణం చెబుతోంది.
ఈ ఆలయంలో భువనేశ్వరిదేవి, నాగరాజు ఉపదేవతలు. శకుని ఆలయానికి ప్రహారీగోడలు మాత్రమే ఉంటాయి. పై కప్పు గాని, తలుపులు కానీ ఏం లేవు.. భక్తులు అన్ని వేళలా దర్శనం చేసుకుంటారు. శకుని విగ్రహం సమీపంలో ఒకగద ఉంది. ఆ విగ్రహానికి ఎదురుగా వున్న ఒక వేదిక పై భక్తులు తాము తెచ్చిన పూజా సామాగ్రి, ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తారు.
శకుని మంచివాడే. పరిస్థితుల ప్రాబల్యంతో తప్పులు చేశాడని కొన్ని తెగల ప్రజలు శకునికిపూజలు చేస్తారు.. ఈ ప్రాంతంలోని దొమ్మరి జాతి వారు శకుని తమను కాపాడే దైవంగా నమ్మి పూజలు, ఉత్సవాలు జరుపుతారు. పగవారి వలన తమకు ఎటువంటి బాధలు కలుగకూడదని శకునిని వేడుకుంటారు. పొంగల్ ను నైవేద్యంగా పెడతారు. పువ్వులు, పండ్లు, కల్లు, పట్టు వస్త్రాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి అర్చనలు చేస్తారు. ఈ ఆలయ నిర్వహణా బాధ్యతను ఆదివాసుల, దేశదిమ్మరుల కుటుంబాలవారు చూసుకుంటారు.. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మే మాసాలలో భారీ ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలోజనాలు పాల్గొంటారు.
ఈ పవిత్రేశ్వరం కేరళలోని కొల్లం జిల్లా కొట్టారక్కర తాలూకాలో ఉంది. తిరువనంతపురం నుండి 64 కి.మీ దూరం, కొల్లం నుండి 42 కి.మీ దూరం. కొట్టారక్కరా నుండి 13 కి.మీ ప్రయాణంచేసి.. శకుని ఆలయానికి చేరుకోవచ్చు.