ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది. రైతుల కల్లాల దగ్గరికి వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని… పోర్టెడ్ బియ్యాన్ని ప్లాస్టిక్ బియ్యం అనుకోవద్దని… 10 రోజుల్లో రైతులకు దాన్యం డబ్బులు అందిస్తామని ప్రకటన చేశారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
అలాగే ఏపీ లో రేషన్ బియ్యం సంబంధించి నగదు బదిలీ నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సాంకేతిక కారణాలతో నగదు బదిలీని ఆపేస్తున్నారు అని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటన చేశారు. నగదు బదిలీ పై నిర్ణయం తీసుకుంటే తెలుపుతామని వివరించారు.
కొద్ది రోజుల క్రితం కూడా పేద ప్రజలకు నగదు బదిలీ పథకంపై ప్రతిపక్ష పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నగదు బదిలీ ప్రారంభించాలని 2017 లోని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. మా దేశాలపై అదే పార్టీ విస్మరించటం విడ్డూరంగా ఉందని సోమవారం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రేషన్ నగదు బదిలీ పథకాన్ని మంత్రి కారుమురి నాగేశ్వరరావు.