ఇవాళ ఆచార్య మూవీ టీం మీడియాతో మాట్లాడింది. మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూజా హెగ్డే, డైరెక్టర్ కొరటాల శివ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. చరణ్ కి నటన విషయంలో ఎప్పుడు సలహాలు ఇవ్వలేదని.. అవతలి వారి నటనను బట్టి మన స్పందన వుంటుందని తెలిపారు.
రామ్ చరణ్ నటనలో ఎంతో పరిణితి కనపడిందని.. మేము ఇద్దరం కలిసి వేసిన డాన్స్ సాంగ్ అప్పుడు చరణ్ తో కొంచెం టెన్షన్ పడ్డానని వెల్లడించారు. అప్పుడే నాటు నాటు సాంగ్ వచ్చింది ఆ సాంగ్ లో వాళ్ల నటన చూసి సెట్ లో చరణ్ తో డాన్స్ కి కొంచెం టెన్స్ పడ్డాను.. నాకు నిత్య విద్యార్థిగా వుండడం ఇష్టమన్నారు.
నాకు నిజ జీవితం లో తారస పడే ప్రతి ఒక్కరి లొ నేను ఆచార్య ను చూసుకుంటానని.. ఆచార్య లో నా క్యారెక్టర్ లో నాయకత్వ లక్షణాలు పరిపూర్ణంగా వుంటాయి అదే ఆ క్యారెక్టర్ ప్రత్యేకత అని తెలిపారు. చరణ్ బిహేవియర్ చూస్తుంటే నన్ను నేను అద్దంలో చుసుకున్నట్టు వుంటుంది.. ఆచార్య అనే పేరు బహుశా గుణ పాఠం చేపుటననేమో శివ ఆ పేరు పెట్టారని తెలిపారు.