వికలాంగులకు అండగా నిలిచారు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. గురువారం రోటరీ క్లబ్, మల్లారెడ్డి యూనివర్సిటీ తరపున 700 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతులను ఉచితంగా అందించారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దివ్యాంగులకు ఈ కృత్రిమ చేతులను అందించడం సంతోషంగా ఉందని మంత్రి మల్లారెడ్డి.. అమెరికాకు చెందిన హేలన్ అనే కంపెనీ తయారు చేసిన ఈ హ్యాండ్స్‌కు రూ. 7 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు.
ఈ ఖర్చును రోటరీ క్లబ్, మల్లారెడ్డి యూనివర్సిటీ భరించిందని స్పష్టం చేశారు మల్లారెడ్డి. బాధిత వ్యక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఒక్కో చేయి తయారీకి లక్ష ఖర్చు అయినట్లు తెలిపారు. ఈ కృత్రిమ చేతుల ద్వారా 4 కేజీల బరువును మోసేందుకు వీలుగా ఉంటుందన్నారు. అంతేకాకుండా టూ, త్రీ వీలర్ వాహనాలను కూడా నడపడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో చేయడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.